'వీ.బీ. గ్రామ్ జీ చట్టం రద్దు చేయాలి'
నిర్మల్: సోన్ మండలంలోని కడ్తాల్ గ్రామంలో బుధవారం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బర్కుంట గంగారం ఉపాధి హామీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వీ.బీ. గ్రామ్ జీ చట్టాన్ని రద్దు చేసి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. వారితో పాటు గ్రామస్తులు, తదితరులు ఉన్నారు.