నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన అడిషనల్ కలెక్టర్

నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన అడిషనల్ కలెక్టర్

జగిత్యాల జిల్లా బుగ్గారం మండల మూడో విడత ఎన్నికల్లో భాగంగా మండల కేంద్రంతో పాటు సిరికొండ, వెల్గొండ, శేకల్ల గ్రామాల్లోని నామినేషన్ కేంద్రాలను బుధవారం అడిషనల్ కలెక్టర్ రాజా గౌడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా నామినేషన్ల ప్రక్రియ తీరును, ఆన్‌లైన్ డేటా ఎంట్రీని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆయన వెంట ఎంపీడీవో సుమంత్, తదితర అధికారులు ఉన్నారు.