పౌరసరఫరాల గోదాములు తనిఖీ చేసిన అధికారులు
VZM: గజపతినగరంలోని పౌరసరఫరాల నిత్యవసర సరుకుల గోదాములను మంగళవారం సాయంత్రం విజిలెన్స్ సీఐ బి.సింహాచలం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గోదాములోని సరుకులు రికార్డుల్లో నిలవలు సరిపోడంతో సంతృప్తి వ్యక్తం చేశారు. తూనికలు కొలతల శాఖ అధికారిని ఉమా సుందరి తనిఖీలు నిర్వహించారు. ఇందులో హెచ్‌సీ కామేశ్వరరావు, కానిస్టేబుల్ పురుషోత్తం, గోదాం ఇంఛార్జ్ ఈశ్వరరావు పాల్గొన్నారు.