కానిస్టేబుల్ రాకేశ్ గౌడ్ సస్పెండ్

KMR: విధులకు గైర్హాజరై, మద్యం తాగి వాహనం నడిపిన నిజాంసాగర్ పీఎస్ కానిస్టేబుల్ రాకేశ్ గౌడ్‌ను సస్పెండ్ చేస్తూ KMR SP రాజేశ్ చంద్ర శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. తాడ్వాయి పీఎస్ పరిధిలో రాకేశ్ గౌడ్ మద్యం తాగి ప్రయాణిస్తూ ప్రమాదానికి గురయ్యారు. శ్వాస పరీక్షలో అధిక మద్యం తాగినట్లు నిర్ధారణ కావడంతో సస్పెండ్ చేసినట్లు SP వెల్లడించారు.