'వైసీపీ శ్రేణులు తప్పుడు ప్రచారం చేస్తున్నారు'

ELR: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వైసీపీ నాయకులు దుష్ప్రచారం మానుకోవాలని ఏలూరు జనసేన ఇంఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇటీవల జమ్ము కాశ్మీర్‌లో పాకిస్తాన్ ఉగ్రవాదులు హిందూ మతాన్ని టార్గెట్ చేసి పాల్పడిన దాడుల గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడితే ముస్లిం సమాజాన్ని కించపరిచారని వైసీపీ శ్రేణులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు.