పోలీసులకు ఉచిత బస్సు పాసులు ఇవ్వాలని వినతి

కృష్ణా: రాష్ట్రంలో ఉన్న పోలీసులకు ఉచిత ఆర్టీసీ బస్సు పాసులు కల్పించాలని పోలీసు అధికారుల రాష్ట్ర సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు మంత్రి రాంప్రసాద్‌ను కోరారు. ఈ మేరకు బుధవారం ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు. పోలీస్ స్టేషన్ నుంచి బయటికి వెళ్లే సమయంలో సిబ్బంది అసౌకర్యం ఎదుర్కొంటున్నారని అన్నారు. ఉచిత బస్సు పాసులు కల్పించాలని వినతి పత్రం అందిచినట్లు చెప్పారు.