ఇరాన్ యుద్ధనౌకపై దాడి .. 101 మంది గల్లంతు
శ్రీలంక తీరంలో ఇరాన్ యుద్ధనౌకపై దాడి జరిగింది. ఈ దాడిలో 101 మంది గల్లంతు అవగా.. 32 మందికి గాయాలైనట్లు తెలుస్తోంది. ఇరాన్‌కు చెందిన ఐరిస్ డెనా అనే యుద్ధ నౌకపై ఈ దాడి జరిగింది. మునిగిపోతున్న యుద్ధనౌక నుంచి 32 మందిని కాపాడినట్లు చెప్పారు. ఈ వివరాలను శ్రీలంక నేవీ అధికారి వెల్లడించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.