పరిపాలనకు ఆదర్శం శ్రీరామచంద్రమూర్తి: ఎమ్మల్యే
VKB: యాలాల(M)లోని జుంటిపల్లి శ్రీసీతారామచంద్ర స్వామివారి కళ్యాణం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పరిపాలనకు శ్రీరామచంద్రమూర్తి జీవితం ఒక ఆదర్శం అని అన్నారు. భద్రాచలం తర్వాత అతిపెద్ద దేవాలయంగా జుంటిపల్లి సీతారాముల దేవాలయం గుర్తింపు పొందిందన్నారు. ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు.