రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తి సాధించాలి: సింగరేణి డైరెక్టర్
MNCL: మందమర్రి మండలం సింగరేణి భూగర్భ, ఓసీపీలలో రక్షణ ప్రమాణాలను పాటిస్తూ బొగ్గు ఉత్పత్తి సాధించాలని డైరెక్టర్ వెంకటేశ్వరరావు సూచించారు. ఆదివారం ఆయన మందమర్రి ఏరియా జీఎం రాధాకృష్ణతో కలిసి కేకే ఓసీపీని పరిశీలించారు. ఓబీ (ఓవర్ బర్డెన్) వెలికితీత పనులను తక్షణమే ప్రారంభించాలని ఈ సందర్భంగా ఆయన ఆదేశించారు.