'ఆటో కార్మికులకు నెలకు 12వేలు ఇవ్వాలి'

'ఆటో కార్మికులకు నెలకు 12వేలు ఇవ్వాలి'

NDL: కూటమి అమలు చేసిన శ్రీ శక్తి పథకం ద్వారా నష్టపోతున్న ఆటో కార్మికులకు నెలకు 12వేలు ఇవ్వాలని మండల కార్యదర్శి పక్కిరి సాహెబ్ డిమాండ్ చేశారు. బుధవారం నంది కోట్కూరు మండలం, కొణిదేల ఆర్టీసీ బస్టాండ్‌లో సమావేశం నిర్వహించి, మాట్లాడారు. ఆటో కార్మికుల సంక్షేమ బోర్డ్ ఏర్పాటు, పలు సమస్యల పరిష్కారం కోసం సీఐటీయూ ఆధ్వర్యంలో పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.