నిందితులకి రిమాండ్
విశాఖపట్నంలో సంచలనం రేపిన శాంతి కుమారి మృతి కేసులో నలుగురిని రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ నరసింహమూర్తి తెలిపారు. పుట్టినరోజు వేడుకల సందర్భంగా మిత్రుల మధ్య గొడవ జరిగి, శాంతి కుమారిపై దాడి జరిగినట్లు చెప్పారు. ఆత్మహత్యా? లేక దాడి కారణంగా మరణమా? అన్నదానిపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు. నిందితుల వయస్సు 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉందని వెల్లడించారు.