'అవార్డుల కోసం ఈనెల 27లోపు దరఖాస్తు చేసుకోండి'
NLG: జిల్లా కార్మిక శాఖ ఆధ్వర్యంలో ఉత్తమ యాజమాన్య అవార్డుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. కార్మికుల భద్రత, మహిళా సంక్షేమం, స్థానిక ఉపాధి కల్పన, సామాజిక సేవా కార్యక్రమాలను ప్రాతిపదికగా తీసుకొని ఈ అవార్డులను ఎంపిక చేస్తారు. ఆసక్తి గల యాజమాన్యాలు ఏప్రిల్ 27వ తేదీలోపు నల్గొండలోని కార్మిక శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని ఉపసంచాలకులు పీ.అరుణ సూచించారు.