తేనెటీగల దాడిలో ఇద్దరికి గాయాలు
NGKL: జిల్లా కేంద్రంలోని బొడ్రాయి సమీపంలో తేనెటీగలు దాడి చేయడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రభుత్వ స్థలంలోని చెట్టుపై ఉన్న తేనె పట్టు ఒక్కసారిగా కదలడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదకరంగా మారిన తేనె పట్టులను తొలగించాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.