27 పంచాయతీలకు 9 కేంద్రాలు ఏర్పాటు

27 పంచాయతీలకు 9 కేంద్రాలు ఏర్పాటు

KMM: మూడో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్లు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. తల్లాడ మండలంలోని 27 పంచాయతీలకు తొమ్మిది నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎంపీడీవో సురేష్ బాబు తెలిపారు. అన్నారు గూడెం, మల్లారం, బిల్లుపాడు, కుర్నవల్లి, నూతనకల్, మిట్టపల్లి, పినపాక, రంగంబంజర, తల్లాడ పంచాయతీ కార్యాలయాల్లో నామినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.