'క్షయ వ్యాధి నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత'
MNCL: క్షయ వ్యాధి నివారణ ప్రతి ఒక్కరి బాధ్యతని జన్నారం మండలంలోని తిమ్మాపూర్ గ్రామ సర్పంచ్ గుగ్లావత్ సంగీత పంచాయతీ కార్యదర్శి లావణ్య హెల్త్ అసిస్టెంట్ కమలాకర్ కోరారు. ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం సందర్భంగా మంగళవారం జన్నారం మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో ప్రజలకు క్షయ వ్యాధి నివారణపై అవగాహన కల్పించారు. క్షయ వ్యాధి రాకుండా టీకాలు వేయించుకోవాలన్నారు.