నిరుపేదలు ఆత్మగౌరవంతో బతకాలి: ఎమ్మెల్యే

KMR: నిరుపేదలు ఆత్మగౌరవంతో బతకాలని ఉద్దేశంతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను నిర్మిస్తుందని, ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు చెప్పారు. శుక్రవారం నిజాంసాగర్ మండలంలోని మంగ్లూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేసి లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.