VIDEO: కనులపండువగా సీతారాముల కళ్యాణోత్సవం

VIDEO: కనులపండువగా సీతారాముల కళ్యాణోత్సవం

BDK: భద్రాచల పుణ్యక్షేత్రంలో సీతారాముల కళ్యాణోత్సవం కనులపండువగా జరిగింది. లక్షలాది మంది భక్తుల సమక్షంలో వేద మంత్రోచ్ఛారణలు, రామనామ స్మరణల మధ్య రామయ్య సీతమ్మకు మాంగళ్యధారణ చేశారు. ఈ మంగళ సూత్రాలను భక్త రామదాసు చేయించారని వేద పండితులు గుర్తు చేశారు. ఈ ఘట్టాన్ని ప్రత్యక్షంగా చూడటం తమ అదృష్టమని భక్తులు పులకించిపోయారు. భద్రాద్రి పరిసరాలన్నీ భక్తి పారవశ్యంతో మార్మోగాయి.