మ్యాంగో జ్యూస్ ఫాక్టరీ ఎదుట మామిడి రైతుల ధర్నా

మ్యాంగో జ్యూస్ ఫాక్టరీ ఎదుట మామిడి రైతుల ధర్నా

చిత్తూరు మ్యాంగో జ్యూస్ ఫ్యాక్టరీ ఎదుట డబ్బు కోసం అన్నదాతలు ధర్నా చేపట్టారు. మామిడిని కొనుగోలు చేసి 6 నెలలు అవుతున్నా.. ఇంకా డబ్బులు చెల్లించలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నగదు జమ అయ్యేవరకు కదలబోమని అన్నారు. కిలో మామిడికి రూ. 8 ఇస్తామని హామీ ఇచ్చి.. ఇప్పుడు రూ. 4 ఇస్తామంటూ ఫ్యాక్టరీ యాజమాన్యం బుకాయిస్తుందని ఆరోపించారు. దీనిపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు.