నేడు పుష్కరాల అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష

నేడు పుష్కరాల అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష

BHPL: కాళేశ్వరంలో మే 15 నుంచి 28 వరకు నిర్వహించనున్న సరస్వతి పుష్కరాల అభివృద్ధి పనుల పురోగతిపై భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ మంగళవారం సంబంధిత శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు నిర్వహించనున్న ఈ సమావేశంలో పుష్కరాల పనులపై చర్చించి, సూచనలు చేస్తారు. అనంతరం కాళేశ్వరంలో జరుగుతున్న పనులను క్షేత్రస్థాయిలో ఆయన పరిశీలించనున్నారు.