సైనిక కుటుంబాన్ని పరామర్శించిన జడ్పీ ఛైర్మన్
VZM: మెరకముడుదాం మండలం, గొల్లలవలస గ్రామం, భారత సైనిక దళంకు చెందిన జవాన్ అడ్డూరి దుర్గాప్రసాద్ ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందారు. విషయం తెలిసుకున్న జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు వారి నివాసానికి వెళ్లారు. జవాన్ చిత్రపటానికి పూలమాల వేసి, నివాళ్లు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మీ కుటుంబానికి ఏప్పుడు అండగా ఉంటానని తెలిపారు.