జిల్లా ప్రగతికి స్వచ్ఛంద సంస్థల సహకారం

జిల్లా ప్రగతికి స్వచ్ఛంద సంస్థల సహకారం

విశాఖపట్నం నూతన జిల్లా కలెక్టర్‌ను వైజాగ్ స్వచ్ఛంద సంస్థల ఫోరమ్ ప్రతినిధులు నిన్న మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఫోరమ్ ప్రతినిధి నరవ ప్రకాశరావు వినతిపత్రం అందజేస్తూ.. జిల్లా అభివృద్ధిలో ప్రభుత్వానికి అండగా ఉంటామని, తమ సేవలను వినియోగించుకోవాలని కోరారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ, త్వరలోనే స్వచ్ఛంద సంస్థలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.