బాబు జగ్జీవన్ రామ్ సేవలు అభినందనీయం: కలెక్టర్
ASF: బాబు జగ్జీవన్ రామ్ సేవలు అభినందనీయమని జిల్లా కలెక్టర్ కె. హరిత అన్నారు. ఆసిఫాబాద్ కలెక్టరేట్‌లో ఇవాళ SC సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి ఉత్సవాలకు MLA కోవ లక్ష్మి, అదనపు కలెక్టర్ డేవిడ్‌లతో కలసి హాజరయ్యారు. అయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం తన జీవితాన్ని అంకితం చేశారన్నారు.