సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన
WNP: సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అమరచింత ఎస్సై స్వాతి విద్యార్థులకు సూచించారు. మంగళవారం జడ్పీ హైస్కూల్లో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడుతూ.. సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 నంబర్కు ఫిర్యాదు చేయాలన్నారు. మహిళల భద్రత కోసం 'షీ టీమ్స్' నిరంతరం నిఘా ఉంచుతాయని, వేధింపులకు గురైతే 100కు కాల్ చేయాలని కోరారు.