ట్రాక్టర్, బైక్ ఢీ.. ఇద్దరికి తీవ్ర గాయాలు

ట్రాక్టర్, బైక్ ఢీ.. ఇద్దరికి తీవ్ర గాయాలు

NLR: జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మర్రిపాడు మండలంలోని డీసీపల్లి-వెన్నవాడ రోడ్డుపై నిన్న రాత్రి బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులు ట్రాక్టర్‌ను ఢీకొట్టడంతో ఒకరి పరిస్థితి విషమంగా మారింది. వెన్నవాడ నుంచి డీసీపల్లికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. క్షతగాత్రులను 108 వాహనంలో ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.