రాయదుర్గంలో 'బాబు ష్యూరిటీ-మోసం గ్యారెంటీ' కార్యక్రమం

ATP: రాయదుర్గం పట్టణం 20, 23వ వార్డుల్లో మున్సిపల్ ఛైర్‌పర్సన్ శిల్ప, రాష్ట్ర చేనేత విభాగం ప్రధాన కార్యదర్శి శివకుమార్, స్థానిక వార్డ్ కౌన్సిలర్ సంజీవప్ప ఆధ్వర్యంలో శనివారం 'బాబు ష్యూరిటీ-మోసం గ్యారెంటీ' కార్యక్రమం నిర్వహించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా చంద్రబాబు ప్రజలను మోసం చేశారని స్థానికులకు వారు వివరించారు.