21న జిల్లాకు ఎస్సీ కమిషన్ ఛైర్మన్ రాక
ATP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల కమిషన్ ఛైర్మన్ కేఎస్ జవహర్ ఈ నెల 21న అనంతపురం జిల్లాలో పర్యటించనున్నట్లు కలెక్టర్ ఓ. ఆనంద్ ఇవాళ తెలిపారు. జిల్లాలో ఎస్సీ సంక్షేమ పథకాల అమలు, పెండింగ్ సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారని అన్నారు. రోస్టర్ అమలు తదితర అంశాలను కూడా పరిశీలిస్తారని పేర్కొన్నారు.