VIDEO: పోలీస్ ప్రధాన కార్యాలయంలో జాతీయ పతకం ఆవిష్కరణ

MBNR: జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా ఎస్పీ జానకి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. స్వాతంత్య్రం అనేది స్వాతంత్య్ర సమరయోధుల పోరాట ఫలితమని, దేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని ఆమె ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.