తుపాను బాదిత రైతులను ఆదుకోవాలని కలెక్టర్‌కు వినతి
VZM: విజయనగరం కిసాన్ కాంగ్రెస్ సెల్ అద్యక్షులు బెవర సత్యం నాయుడు, జిల్లా జనరల్ సెక్రటరీ శ్రీనివాసరావు శుక్రవారం కలెక్టర్ రాంసుందర్ రెడ్డిని కలెక్టరేట్‌లో మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్బంగా జిల్లాలో మొంథా తుపాన్ బాదిత రైతులను వెంటనే ఆదుకోవలని వినతి పత్రం అందజేశారు. పార్టీలకు అతీతంగా పంట యొక్క నష్టపరిహారాన్ని అందించాలన్నారు.