గుండెపోటుతో వ్యవసాయ కూలీ మృతి
SRCL: తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ బచ్చపల్లి నాగవ్వ ఇవాళ తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారు. రోజూ కూలి చేసి కుటుంబాన్ని పోషించే నాగవ్వ అకాల మరణంతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. ఆమెకు భర్త, ఇద్దరు కొడుకులు, ఓ కూతురు ఉన్నారు.