ప్రతిభను చాటుకున్న నవభారత్ విద్యార్థిని

ప్రతిభను చాటుకున్న నవభారత్ విద్యార్థిని

BDK: పాల్వంచ నవభారత్ స్కూల్ లో 9వతరగతి చదువుతున్న విద్యార్ధిని సేవిత శ్రీ వైష్ణవి స్టేట్ కళా ఉస్తవ్ సింగింగ్ కాంపిటీషన్ లో ఈరోజు ద్వితీయ స్థానం గెలుచుకుంది. గత నెలలో కొత్తగూడెం క్లబ్ నందు నిర్వహించిన జిల్లా స్థాయి కళా ఉస్తవ్ సింగింగ్ కాంపిటీషన్‌లో మొదటి స్థానం కైవసం చేసుకుని స్టేట్ కళా ఉస్తవ్‌కి సెలెక్ట్ అయ్యింది. దీంతో సేవితకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.