గుర్తు తెలియని వ్యక్తి మృతి
KDP: భాకరాపేట - ఒంటిమిట్ట రైల్వే స్టేషన్ల మధ్య మాధవరం వద్ద ఈ రోజు ఉదయం సుమారు 40 సంవత్సరాల వయస్సు గల వ్యక్తి రైలు కింద పడి మృతి చెందాడు. ఘటనపై కడప రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి మృతుడి ఆచూకీ, మృతికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. మృతుడు సిమెంటు రంగు ఫుల్ చొక్కా, నల్ల లుంగీ ధరించి ఉన్నట్లు గుర్తించారు.