'యూరియా కొరతతో రైతులకు ఇబ్బందులు'

VKB: జిల్లాలో యూరియా కొరత రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. వర్షాల కారణంగా పంటలు దెబ్బతినడంతో వాటిని కాపాడుకోవడానికి యూరియా అవసరం ఎక్కువగా ఉంది. అయితే, సరఫరా తక్కువగా ఉండటం, వచ్చిన వెంటనే అమ్ముడైపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యూరియా అమ్మకాలతో లాభాలు లేకపోవడంతో చాలామంది వ్యాపారులు విక్రయాలకు దూరంగా ఉండటం ఈ సమస్యకు మరో కారణం.