గుర్తుతెలియని వ్యక్తి దారుణ హత్య
అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం బీ కొత్తకోట మండలంలో శుక్రవారం ఉదయం గోళ్ల తోపు వద్ద గుర్తుతెలియని యువకుడిని కొందరు వ్యక్తులు దారుణంగా హత్య చేసి పరారయ్యారు. ఈ ఘటన సంచలనం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. సీఐ గోపాల్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.