రైలు పట్టాలపై పడుకుని ఇద్దరు యువకులు ఆత్మహత్య

రైలు పట్టాలపై పడుకుని ఇద్దరు యువకులు ఆత్మహత్య

తిరుపతి: తడ(M) కొండూరు రైలు కింద పడి ఇద్దరు స్నేహితులు ఆత్మహత చేసుకున్నారు. ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొనడంతో యువకులు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు పేర్నాడు, పిండిపాలెం గ్రామాలకు చెందిన జడ సునీల్, కళ్యాణ్‌గా గుర్తించారు. కాగా కళ్యాణ్‌కు నెలన్నర క్రితమే వివాహం కావడంతో కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. కాగా సూసైడ్‌కు గల కారణాలు తెలియాల్సి ఉంది.