ప్రాణం తీసిన ఈత సరదా
VKB: ఈత కోసం వెళ్లి ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన చౌడపూర్ మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కల్మాన్ కాల్వ గ్రామానికి చెందిన నవాజ్ పాషా కుమారుడు శంషీర్(9) మరికొందరు మధ్యాహ్నం గ్రామ సమీపంలోని బావిలో కొందరు ఈత కొట్టడానికి వెళ్లారు. శంషీర్ ఈత రాకున్నా బావిలోకి దిగి, నీట మునిగి అక్కడికక్కడే మృతి చెందాడు.