22 రోజులుగా నిలిచిపోయిన సిగ్నల్స్

ASR: గత 22 రోజులుగా బీఎస్ఎన్ఎల్ సెల్ సిగ్నల్స్ నిలిచిపోయినా ఎవరూ పట్టించుకోవడంలేదని వీఆర్ పురం మండలం సోములగూడెం, చొప్పెల్ల గ్రామాల ప్రజలు వాపోతున్నారు. గతంలో అప్పుడప్పుడు అయినా సిగ్నల్ వచ్చేదని 22 రోజులుగా ఆ పరిస్థితి కూడా లేదంటున్నారు. దీంతో సచివాలయ సిబ్బంది, అంగన్వాడీ ఉద్యోగులుకి ఇబ్బంది తప్పడం లేదన్నారు. సంబంధిత అధికారులు స్పందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.