విషాదం... జ్వరంతో ఆరేళ్ల బాలుడు మృతి

విషాదం... జ్వరంతో ఆరేళ్ల బాలుడు మృతి

KMM: కూసుమంచి మండలం కేశవాపురం గ్రామపంచాయతీ పరిధి చింతలతండాకి చెందిన దారావత్ నాగేశ్వరావు కుమారుడు, వార్షిక్ తేజ (6) జ్వరంతో మృతి చెందాడు. గత వారం రోజుల నుంచి జ్వరం రావడంతో ఖమ్మం ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఇవాళ తెల్లవారుజామున మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తేజ కూసుమంచిలో యూకేజీ చదువుతున్నాడు. తేజ మృతితో తండాలో విషాదం నెలకొంది.