కుంభకోణం.. 4,000 మంది సిబ్బందిపై వేటు?

కుంభకోణం.. 4,000 మంది సిబ్బందిపై వేటు?

ఎయిరిండియా సిబ్బందికి ఇచ్చే ఉచిత విమాన టికెట్ల(ELT) భారీ దుర్వినియోగాన్ని యాజమాన్యం గుర్తించింది. ఏటా ఇచ్చే 14 టికెట్లను కుటుంబ సభ్యులకు కాకుండా, బయటి వ్యక్తులకు అధిక ధరలకు అమ్ముకున్నట్లు సుమారు 4,000 మందిపై ఆరోపణలు వచ్చాయి. టాటా గ్రూప్ బాధ్యతలు చేపట్టాక చేరిన వారే ఈ మోసాలకు పాల్పడినట్లు సమాచారం. బాధ్యుల నుంచి సంస్థ డబ్బు రికవరీ చేయడంతో పాటు జరిమానా విధించేందుకు సిద్ధమైంది.