జమ్మికుంట మార్కెట్లో పత్తికి గరిష్ఠంగా రూ.6,500
KNR: తొమ్మిది రోజుల సుదీర్ఘ విరామం అనంతరం సోమవారం జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ తిరిగి ప్రారంభమైంది. మార్కెట్‌కు పత్తి భారీగా తరలివచ్చింది. రైతులు 28 వాహనాల్లో 190 క్వింటాళ్ల పత్తిని విక్రయానికి తీసుకురాగా, దీనికి గరిష్ఠంగా క్వింటాకు రూ.6,500 ధర పలికింది. గోనె సంచుల్లో తీసుకొచ్చిన 16 క్వింటాళ్ల పత్తికి గరిష్ఠంగా రూ.6,000 ధర లభించింది.