'మొదటిసారి ఓటు సంతోషాన్నిచ్చింది'
NRML: శనివారం ప్రారంభమైన రెండవ విడత పంచాయతీ ఎన్నికలలో మొదటిసారి ఓటు వేసి పలువురు ఓటర్లు తమ అనుభవాన్ని పంచుకున్నారు. దాత్రిక శ్వేత మాట్లాడుతూ.. మొదటిసారి ఓటు అనుభవం ఉత్సాహాన్ని ఇచ్చిందని, ప్రజాస్వామ్యంలో మంచి నాయకున్ని ఎన్నుకునే అవకాశం సద్వినియోగం చేసుకున్నానని తెలిపారు.