డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల బిల్లుల కోసం రాస్తారోకో
NZB: రుద్రూర్ మండలం బొప్పాపూర్‌కి చెందిన డబుల్ బెడ్ లబ్ధిదారులు గత ప్రభుత్వ హయాంలో ఇళ్లు కట్టుకున్నారు. ఇప్పటివరకు బిల్లులు రాలేదని రుద్రూర్ బోధన్ రహదారిపై ఇవాళ లబ్ధిదారులు రాస్తారోకో చేశారు. తమ ఇంటి బిల్లులు గత 4 సంవత్సరాల నుంచి రావడం లేదని వాపోయారు. బిల్లులు వచ్చిన కూడా తమకు ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే బిల్లులు ఇవ్వాలని లబ్దిదారులు డిమాండ్ చేశారు.