పుంగనూరులో పల్స్ పోలియో బ్యానర్ల ఆవిష్కరణ
CTR: ఈనెల 21న జరిగే జాతీయ పల్స్ పోలియోను విజయవంతం చేయాలని మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా పల్స్ పోలియో బ్యానర్లను సోమవారం పుంగనూరు మున్సిపల్ కార్యాలయంలో ఆవిష్కరించారు. అర్బన్ PHC డాక్టర్ లు రజిత, కిరణ్మయిలు మాట్లాడుతూ.. పట్టణంలో 5 సంవత్సరాల్లోపు పిల్లలు సుమారు 45, 890 మందిని గుర్తించినట్లు చెప్పారు.