జైనూర్ మండలంలో పర్యటించిన DCC అధ్యక్షురాలు
ASF: జైనూర్‌లో నూతన DCC అధ్యక్షురాలు ఆత్రం సుగుణ మంగళవారం పర్యటించారు. సిర్పూర్, లింగాపూర్ మండలాల కార్యకర్తలు డోలు డప్పులతో ఆమెకు పూలమాలలు వేసి స్వాగతం పలికారు. అనంతరం జంగావ్ హనుమాన్ టెంపుల్ నుంచి జైనూర్ పార్టీ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మహిళలను గుర్తించి ముఖ్యమైన పదవులను ఇవ్వడం పట్ల కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేశారు.