ఉత్తర్వుల కోసం కోదండరామ్‌కు వినతి

HYD: ఉపాధ్యాయులను ఏపీ, తెలంగాణ అంతర్ రాష్ట్ర బదిలీలు జరిగేలా చూడాలని పలువురు ఉపాధ్యాయులు ఎమ్మెల్సీ కోదండరామ్‌కు వినతిపత్రం అందజేశారు. 11 సంవత్సరాలుగా అంతర్ రాష్ట్ర బదిలీలు లేక కుటుంబాలకు దూరంగా ఉంటూ ఇబ్బందులు పడుతున్నామన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి వేసవి సెలవుల్లో ఉత్తర్వులు ఇప్పించాలని కోరారు. ఇక్బాల్, వేణుమాధవ్, జోష్ విక్టర్, విజయ కలిశారు.