పుష్పాలంకరణలో నందవరం చౌడేశ్వరి దేవి

పుష్పాలంకరణలో నందవరం చౌడేశ్వరి దేవి

NDL: బనగానపల్లె మండలం నందవరం శ్రీచౌడేశ్వరి దేవి ఆలయంలో అమ్మవారు ఆదివారం ప్రత్యేక పుష్పాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈవో శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో అర్చకులు అమ్మవారికి ప్రత్యేక అలంకరణ, రుద్రాభిషేకం, మహా మంగళహారతి వంటి ప్రత్యేక పూజలు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు క్యూలైన్లలో వేచి ఉండి మొక్కులు చెల్లించుకున్నారు.