హనుమాన్ శోభాయాత్ర ప్రారంభం

హనుమాన్ శోభాయాత్ర ప్రారంభం

TG: హైదరాబాద్​లోని కర్మన్‌ఘాట్ నుంచి హనుమాన్ శోభాయాత్ర ప్రారంభమైంది. కర్మన్‌ఘాట్ నుంచి తాడ్‌బండ్ వరకు ర్యాలీ కొనసాగనుంది. పెద్ద సంఖ్యలో భక్తులు శోభాయాత్రలో పాల్గొంటున్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. జై హనుమాన్.. జైశ్రీరామ్ అనే నినాదాలతో ఆలయ పరిసరాలు హోరెత్తుతున్నాయి. ఉదయం నుంచే అంజన్న ఆలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు.