మియా ఖాన్ మసీదులో జంగిల్ క్లియరెన్స్ పనులు
కృష్ణా: గుడివాడ బంటుమిల్లి రోడ్డులోని మియా ఖాన్ మసీదు ప్రాంగణంలోని ముస్లిం ఖాభరస్తాన్(స్మశాన వాటిక)లో జంగిల్ క్లియరెన్స్ కార్యక్రమాన్ని గురువారం చేపట్టారు. ఖాభరస్తాన్ పరిసరాల్లో పెరిగిన పొదలు, చెత్తను పూర్తిగా తొలగించి, మార్గాలను శుభ్రపరిచారు. భక్తులకు, స్థానికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా కార్యాచరణ చేయించారు.