12న కాకినాడలో జాబ్ మేళా.!
కాకినాడ జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈనెల 12న 100 ఉద్యోగాల భర్తీకి జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు సంబంధిత అధికారి జీ. శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు. దివీస్ సంస్థలో ఎంపికలు జరుగుతాయని పేర్కొన్నారు. 18 నుంచి 35 ఏళ్ల వయసు ఉండి, B.Sc, M. Sc కెమిస్ట్రీ, బీ. ఫార్మసీ చదివిన అభ్యర్థులు అర్హులని అన్నారు. ఆసక్తి గలవారు ధ్రువపత్రాలతో హాజరుకావాలని కోరారు.