రహదారి భద్రతపై డ్రైవర్లకు అవగాహన సదస్సు

GNTR: గుంటూరు ఉప రవాణా కమిషనర్ కార్యాలయంలో డ్రైవర్లకు రహదారి భద్రతపై శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఉప రవాణా కమిషనర్ సీతారామిరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఆటో డ్రైవర్లు, గూడ్స్ క్యారేజ్, మోటార్ క్యాబ్, మాక్సీ క్యాబ్ ఓనర్లకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా మద్యం సేవించి, సెల్ఫోన్ మాట్లాడుతూ.. వాహనం నడుపరాదని సూచించారు.