'పంట ప్రకారం రైతులకు యూరియా సరఫరా చేయాలి'

BDK: రైతులు వేసిన పంట ప్రకారం యూరియా సరఫరా చేయాలని ఎమ్మెల్యే కనకయ్య అధికారులను ఆదేశించారు. బుధవారం టేకులపల్లి రైతు వేదికలో పలు శాఖల అధికారులతో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు. వ్యవసాయశాఖ అధికారులు తప్పనిసరిగా రైతులు వేసిన పంటలను ఫీల్డ్ వెరిఫికేషన్ చేయాలన్నారు. అటు సీజనల్ వ్యాధుల నివారణకు వైద్యాధికారులు కృషి చేయాలని పేర్కొన్నారు.